బొబ్బిలి మండలం సి హెచ్ బొడ్డవలస అంగన్‌వాడీ కేంద్రంలో ఆగస్టు 1న ప్రపంచ తల్లి పాలు వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్ర సిబ్బంది బాలింతలు, గర్భిణీలకు HB టెస్టులు నిర్వహించడంతో పాటు తల్లి పాలు ప్రాముఖ్యత, పిల్లలకు పాలు ఇవ్వాల్సిన విధానంపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో MLHP మౌనిక, ANM కమల కుమారి, ఆశ కార్యకర్తలు గంగమ్మ, బంగారమ్మ మరియు అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.