కలువరాయిలో తల్లి పాల వారోత్సవాలు

బొబ్బిలి ఐ. సి. డి. ఎస్. సి. డి. పి. ఓ. జాగాన విజయలక్ష్మి ఆదేశాల మేరకు శుక్రవారం బొబ్బిలి మండలం కలువరాయి గ్రామ అంగన్వాడీ కేంద్రాల్లో తల్లి పాల వారోత్సవాల కార్యక్రమాన్ని సర్పంచ్ బి. నటరాజ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ వై. రాజు మాట్లాడుతూ తల్లి పాల ప్రాముఖ్యతను వివరించారు. బిడ్డ పుట్టిన అరగంట లోపు ముర్రుపాలు పట్టాలని చెప్పారు. కార్యక్రమంలో ఎ. ఎన్. ఎం. లావణ్య, అంగన్వాడీ కార్యకర్తలు ఉమా మహేశ్వరి, రోహిణి, కాంతమ్మ, ఆశాలు, తల్లులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్