కొత్తవలస మండలంలోని చింతలపాలెం గ్రామంలో గురువారం చిట్టిపాప తీర్థ మహోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు, ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పాల్గొన్నారు. ప్రతి ఏటా భీష్మ ఏకాదశి రోజున చిట్టిపాప మందిరం వద్ద ఈ మహోత్సవం జరగడం ఆనవాయితీ అని గ్రామ సర్పంచ్ తెలిపారు. రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కోళ్ల రాంప్రసాద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.