కేంద్రాన్ని నిలదీయలేని ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతోంది..కాంగ్రెస్ నాయకుడు

కేంద్రాన్ని నిలదీసే ధైర్యం లేని కూటమి ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని కాంగ్రెస్ నాయకుడు మువ్వల శ్రీనివాసరావు శనివారం విమర్శించారు. అమెరికా–ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత పేరుతో ప్రజలను భయపెడుతున్నారని, ఒకవైపు కొరతలేదని చెబుతూ మరోవైపు ధరలు పెంచడం అన్యాయమని అన్నారు. గ్యాస్ సరఫరా ఆలస్యం వల్ల హోటళ్లు, చిన్న వ్యాపారాలు మూతపడుతున్నాయని, తక్షణమే సరఫరా మెరుగుపరచాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్