మాదక ద్రవ్యాల వాడకం ప్రాణాంతకం: సిఐ నారాయణరావు

బొబ్బిలి రూరల్ సీఐ కె. నారాయణరావు రామభద్రపురం మండలం పాతరేగ గ్రామంలో గ్రామ పెద్దలు, ప్రజలతో అవగాహన సమావేశం నిర్వహించారు. గంజాయి, ఖైనీ, గుట్కా వంటి మాదక ద్రవ్యాల వాడకం వల్ల యువత చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతూ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆయన తెలిపారు. ఈ మత్తు పదార్థాల వల్ల భవిష్యత్తు నాశనం అవుతుందని, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయని హెచ్చరించారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు శాంతియుతంగా జరగాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్