గ్రామీణ సంఘాల ప్రోత్సాహమే అభివృద్ధికి దారి: జె సి రాజు

కారుణ్య ఫౌండేషన్ చైర్మన్ జె.సి.రాజు మంగళవారం బొబ్బిలిలో నాబార్డ్ సహకారంతో దీక్ష మహిళా సంక్షేమ సంస్థ, విద్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేంద్రియ ఉత్పత్తుల మేళాను సందర్శించారు. బెల్లం, వేరుశెనగలు, మిల్లెట్స్, జీడిపప్పు, తేనె వంటి ఉత్పత్తులను కొనుగోలు చేసిన ఆయన, గ్రామీణ స్వయం సహాయక, రైతు సంఘాలను ప్రోత్సహించడం అందరి బాధ్యత అని, మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో తోడ్పడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్