ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీ ప్రారంభం

బొబ్బిలిలో రైతులకు ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా రైతుల వివరాలను నమోదు చేసి, బిల్లులు రూపొందించి ఎరువులు అందజేస్తారు. దీనివల్ల ఎరువుల పంపిణీ, నిల్వలు, విక్రయాల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పర్యవేక్షించడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని, అవకతవకలకు ఆస్కారం లేకుండా రైతులకు సకాలంలో ఎరువులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని కలెక్టర్ తెలిపారు. రైతులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిగ్నల్ సమస్యలున్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం మెరుగుపర్చాలని ఎరువుల విక్రయదారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్