సీతానగరం బ్రహ్మోత్సవాల్లో మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు పాల్గొన్నరు

మన్యం జిల్లా సీతానగరంలో శ్రీ వేణుగోపాలస్వామి, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు, నవ నారసింహ యాగం వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్, ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) చైర్మన్, మాజీ మంత్రి శ్రీ సుజయ్ కృష్ణ రంగారావు పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన ఈ ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ ఉత్సవాలు విజయనగరం, బొబ్బిలి ప్రాంతాల్లో జరుగుతున్నాయి.

సంబంధిత పోస్ట్