బొబ్బిలి మండలంలోని గొల్లపల్లి గ్రామంలో జరిగిన శ్రీ దాడితల్లి అమ్మవారి ఘటోత్సవం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా బుధవారం విజయవంతంగా ముగిసింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బొబ్బిలి రూరల్ సీఐ, ఎస్హెచ్ఓ మరియు పోలీసు సిబ్బంది పటిష్టమైన బందోబస్తు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టారు. ఈ వేడుకలు ప్రశాంతంగా ముగియడంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు.