బొబ్బిలి మండలం, గున్నతోటవలస గ్రామంలో శాసనసభ్యులు ఆర్. వీ. ఎస్. కే. కే. రంగారావు (బేబీ నాయన) పింఛను పంపిణీ కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పింఛను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి అల్లాడ భాస్కరరావు, బొబ్బిలి మండలం టీడీపీ అధ్యక్షులు వాసిరెడ్డి సత్యనారాయణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.