తూర్పు భాగవత కళాకారుల బృందానికి గురు పురస్కారం

భరత ముని జయంతి ఉత్సవాల్లో భాగంగా కాకినాడ శాస్త్రీయ నృత్య కళాకారుల సంక్షేమ సమాఖ్య పిఠాపురంలో నిర్వహించిన సాంస్కృతిక ఉత్సవాల్లో, బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ బొంతలకోటి శంకర రావు బృందం తూర్పు భాగవతాన్ని ప్రదర్శించింది. ఈ ప్రదర్శన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అంతరించిపోతున్న కళలకు జీవం పోస్తున్న శంకర రావు బృందాన్ని నిర్వాహకులు అభినందించారు. అనంతరం, ప్రముఖ నాట్యాచార్యులు లోకేష్ శర్మ, ఇతర ప్రముఖులు డాక్టర్ శంకర రావును గురు పురస్కారంతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్