బొబ్బిలిలో రాష్ట్ర స్థాయి కోలాటం పోటీలకు భారీ స్పందన

బొబ్బిలి మల్టీటాలెంటెడ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం రాజా కాలేజ్ గ్రౌండులో రాష్ట్ర స్థాయి కోలాటం పోటీలు జరిగాయి. దాడితల్లి, సరేపోలమ్మ, దేశమ్మతల్లి పండుగ సందర్భంగా ఎనిమిది జిల్లాల బృందాలు పాల్గొన్నాయి. విజేతలకు స్థానిక ఎమ్మెల్యే బేబీనాయన బహుమతులు అందజేశారు. పక్కి గ్రామ బృందం ప్రథమ బహుమతి రూ. 20,116, అనకాపల్లి జిల్లా కెపి అగ్రహారం నూకాంబికా జంట బృందం ద్వితీయ బహుమతి రూ. 15,116, ముగడ గ్రామ వేణుగోపాల స్వామి బృందం తృతీయ బహుమతి రూ. 12,116 సాధించాయి. గాజువాక, అడ్డూరు బృందాలకు ఇతర బహుమతులు దక్కాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్