బొబ్బిలి గురుకుల పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. గురువారం పాఠశాలలో పూర్వ విద్యార్థులు నిర్మించిన కళావేదికను ప్రారంభించారు. పదో తరగతిలో శత శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించారు. మౌలిక సదుపాయాల కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.