ఆదర్శ రైతు మురళీకృష్ణ మృతి

బొబ్బిలికి చెందిన ఆదర్శ రైతు సాలా వెంకట మురళీకృష్ణ అనారోగ్యంతో మరణించారు. వరి, చెరకు, మామిడి, ఉద్యాన పంటల సాగులో ఆయనకు విశేష పరిజ్ఞానం ఉంది. విదేశీ రకాల మొక్కల సాగులోనూ మెళకువలు నేర్పేవారు. వెంగళరాయసాగర్ జలాలు చివరి ఆయకట్టు భూములకు అందించేందుకు ఆయన నాయకులు, అధికారులపై ఒత్తిడి తెచ్చేవారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్