విజయవాడలో అంగన్వాడీల అక్రమ అరెస్టులను సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి. శంకరరావు ఖండించారు. యాదవవీధి జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. సమ్మె సమయంలో మద్దతు ఇచ్చిన నేతలు అధికారంలోకి వచ్చాక హామీలు నిలబెట్టలేదని విమర్శించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు, మెనూ చార్జీలు పెంచాలని, అంగన్వాడీలను కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.