సామాజిక సేవకు జె. సి రాజుకు డాక్టరేట్ గౌరవం

ప్రముఖ సమాజ సేవకుడు, కారుణ్య ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ జె. సి. రాజుకు సామాజిక సేవా విభాగంలో డాక్టరేట్ లభించింది. గురువారం న్యూఢిల్లీలోని నేషనల్ వైఎంసీఏ ప్రధాన కార్యాలయంలో డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అమోస్ జేమ్స్, ప్రెసిడెంట్ శామ్యూల్ ఈ గౌరవాన్ని ప్రదానం చేశారు. కోవిడ్ సమయంలో ఆయన చేసిన సేవలు, నిస్వార్థ సామాజిక సేవలను గుర్తించి ఈ పురస్కారం అందించారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్, డేవిడ్ విక్టర్, శాంత రాజులు, వైఎస్ చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్