పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకుడు రేవళ్ల

బొబ్బిలి పట్టణంలో ఆదివారం జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకుడు రేవళ్ల కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఆయన ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రజలందరూ తమ సమీపంలోని పోలియో కేంద్రాలకు పిల్లలను తీసుకువెళ్లి చుక్కలు వేయించాలని కోరారు. ప్రజల భాగస్వామ్యంతోనే పల్స్ పోలియో కార్యక్రమం పూర్తిస్థాయిలో విజయవంతమవుతుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్