బొబ్బిలి మండలంలోని కమ్మవలస గ్రామానికి చెందిన 78 ఏళ్ల ఉపాధి హామీ కూలీ పెద్దింటి సత్యం నాయుడు మంగళవారం వడదెబ్బతో మృతి చెందారు. చెరువు పనులకు వెళ్లిన ఆయన, ఎండ తీవ్రతకు తట్టుకోలేక నీరసించిపోయారు. పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్న తర్వాత విశ్రాంతి తీసుకుంటుండగా మరణించారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.