పిడుగు పడి వ్యక్తి మృతి

తెర్లాం మండలంలోని తెర్లాం గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం చెన్నై చెరువులో ఉపాధి హామీ పనులు చేస్తుండగా పిడుగు పడి జమ్మల సూర్యనారాయణ (71) అనే వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో కర్రీ గణపతి అనే మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ విషాద ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్