బొబ్బిలిలో భారీ చోరీ: ఇద్దరు అరెస్ట్, వెండి, బంగారం స్వాధీనం

బొబ్బిలి పట్టణంలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని, బోసర లక్ష్మణరావు, పి. చిన్నలను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. వీరి నుంచి 600 గ్రాముల వెండి, 111 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. గతంలో శ్రీకాకుళం జిల్లా పలాసలో బైక్ దొంగతనాలకు పాల్పడినట్లు తేలింది. అపార్ట్‌మెంట్లలో సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం దర్యాప్తులో జాప్యానికి కారణమైందని, భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సూచించారు.

సంబంధిత పోస్ట్