ఎమ్మెల్యే బేబీ నాయన సొంత నిధులతో తాగునీటి బోరు

బొబ్బిలి మండలం పక్కి గ్రామంలోని వంగరతల్లి ఆలయం వద్ద భక్తులకు తాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు ఎమ్మెల్యే ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీనాయన) తన సొంత నిధులతో మంచినీటి బోరును ఏర్పాటు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులు, గ్రామస్తులు చాలా కాలంగా నీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలియగానే వెంటనే స్పందించి ఈ చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే చర్యలతో భక్తులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్