బేబి నాయన చేతుల మీదుగా అన్నదానం ప్రారంభం

బొబ్బిలిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే బేబి నాయన చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. అన్నదానానికి ముందు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే, వేలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. దైవ సేవతో పాటు మానవ సేవ చేయడం భాగ్యమని, స్వామివారి సన్నిధిలో భక్తులకు అన్నప్రసాదం అందించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే స్వయంగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించడం విశేషం.

సంబంధిత పోస్ట్