బొబ్బిలి నియోజకవర్గంలో రేపు, ఎల్లుండి జరగనున్న మహానాడు కార్యక్రమంపై ఎమ్మెల్యే ఆర్. వి. ఎస్. కె. కె. రంగారావు (బేబీ నాయన) సోమవారం సమీక్ష నిర్వహించారు. నాలుగు మండలాల, పట్టణ క్లస్టర్ ఇంచార్జులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో వర్చ్యువల్ విధానంలో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ అబ్జర్వర్ పొట్నూరు వెంకట రత్నాజీ కూడా పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆయనను దుశ్శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు.