జూనియర్, డిగ్రీ కళాశాలలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే వినతి

రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ను మంగళవారం సచివాలయంలో బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే కే రంగారావు (బేబీ నాయన) మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బొబ్బిలిలో జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల లేమి ఉన్నందున తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. నియోజకవర్గ అభివృద్ధి, స్థానిక సమస్యలపై వివరాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఇద్దరి మధ్య రాజకీయ విషయాలపై చర్చ జరిగినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్