ఎంపీడీవో రవికుమార్ కింతలివానిపేటలో ఉపాధి పనుల పరిశీలన

బొబ్బిలి మండలంలోని కింతలివానిపేట గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) రవికుమార్ శుక్రవారం ఉదయం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కంసాలి బంధ చెరువు వద్ద జరుగుతున్న పూడికతీత పనులను తనిఖీ చేసి, మస్టర్ వెరిఫికేషన్ నిర్వహించారు. చెరువు పనుల్లో నిర్దేశించిన కొలతల ప్రకారం తవ్వకాలు జరపాలని, కూలీలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్‌ను ఆదేశించారు. పని దినాలను సద్వినియోగం చేసుకుంటే సకాలంలో వేతనాలు అందుతాయని కూలీలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ, ఫీల్డ్ అసిస్టెంట్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్