స్వచ్ఛ సర్వేక్షన్-2026లో భాగంగా బొబ్బిలి పట్టణంలో టెర్రస్ గార్డెనింగ్‌కు ప్రోత్సాహం లభిస్తోంది. స్థానిక వెలమ వారి వీధిలో మేడపై సాగు చేస్తున్న టెర్రస్ గార్డెనింగ్‌ను మున్సిపల్ కమిషనర్ ఎల్. రామలక్ష్మి పరిశీలించారు. వంటింటి వ్యర్థాలను ఎరువులుగా మార్చి కూరగాయలు, పూల మొక్కలు పెంచుతున్న ఎం. లక్ష్మిని ఆమె ప్రోత్సహించారు. పురపాలక సంఘం తరఫున గ్రోబ్యాగ్స్, 60 లీటర్ల హెచ్‌డిపిఇ బిన్లను అందజేశారు. ప్రజలు సేంద్రియ విధానాలను అనుసరించాలని ఆమె సూచించారు.