నాయుడువలస పాఠశాల ఆకస్మిక తనిఖీ

రామభద్రపురం మండల విద్యాశాఖ అధికారి తిరుమల ప్రసాద్ మంగళవారం నాయుడువలస పాఠశాలను ఆకస్మికంగా పరిశీలించారు. ప్రాథమికోన్నత పాఠశాలను ఉన్నత పాఠశాల స్థాయికి తీసుకెళ్లేందుకు ఉపాధ్యాయులు సంఘటితంగా పనిచేసి, పాఠశాలపై సమాజ నమ్మకాన్ని పెంచాలని ఆయన సూచించారు. 6, 7, 8 తరగతుల విద్యార్థుల నోట్స్, ఇంగ్లీష్, గణితం సామర్థ్యాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. డిసెంబర్ 5న మెగా పేరెంట్స్ మీట్‌ను పండగలా నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్