కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బొబ్బిలి మున్సిపాలిటీలో కులాల పేర్లతో ఉన్న వీధులకు శుక్రవారం కొత్త పేర్లు పెట్టారు. చట్ట నిబంధనల ప్రకారం ఈ మార్పులు చేశారు. ఒకటో వార్డులోని చాకలి వీధిని నందెన్న వీధిగా, రెండో వార్డులోని హరిజనవాడను ఆది ఆంధ్రవీధిగా, మూడో వార్డులోని పెదచాకలి వీధిని బాపూజీ వీధిగా మార్చారు. పలు వార్డులలోని ఇతర వీధులకు కూడా కొత్త పేర్లు ఖరారు చేశారు. ఈ మార్పులపై మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించి రాష్ట్ర ప్రభుత్వానికి, మానవహక్కుల కమిషన్‌కు నివేదికలు పంపినట్లు కమిషనర్ లాలం రామలక్ష్మి తెలిపారు.