ఎమ్మెల్యే చేతుల మీదుగా సేంద్రియ ఉత్పత్తుల ప్రదర్శన ప్రారంభం

విజయనగరం, బొబ్బిలిలో ఉప ఖజానా కార్యాలయ ఆవరణలో నాబార్డు సహకారంతో ఏర్పాటు చేసిన మూడు రోజుల ఎగ్జిబిషన్‌ను ఎమ్మెల్యే శ్రీ బేబీ నాయన సోమవారం ప్రారంభించారు. మహిళా సంఘాలు, రైతులు పండించిన సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించాలని ఆయన కోరారు. కళాభారతిలో బొబ్బిలి మల్టీ టాలెంటెడ్ గ్రూప్ ఆధ్వర్యంలో జరిగిన కోలాటం, చెక్కభజన, హరికథ ప్రదర్శనలను ఆయన వీక్షించారు. చిన్నారి కళాకారుల నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి, టీడీపీ నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్