తెల్లవారుజామునే పింఛన్లు… అవ్వతాతల్లో హర్షం

బొబ్బిలి నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఆదివారం 1వ తేదీ కావడంతో, ఒక రోజు ముందుగానే శనివారం ఉదయం నుంచే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తున్నారు. బాడంగి మండలంలో తెల్లవారుజామునే సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు చేరుకుని పింఛన్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ సేవలు నేరుగా గడప వద్దకే అందడం తమకు ఎంతో సౌకర్యంగా ఉందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్