పక్కా సమాచారంతో పోలీసులు బుధవారం రాత్రి బాడంగి మండలం ఔరావివలస గ్రామ శివారులోని మామిడి తోటలో పేకాట శిబిరంపై ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1,07,030 నగదు, 9 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని ఎస్ఐ సూర్యకుమారి తెలిపారు.