చెట్టు కొమ్మ పడటంతో బొబ్బిలిలో విద్యుత్ అంతరాయం

బొబ్బిలి పట్టణంలోని స్వామివారి వీధిలో చెట్టు కొమ్మ 11 కేవీ విద్యుత్ లైన్‌పై పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రెండు ఫేజ్‌లు తాకడంతో ఒక ఫేజ్ సరఫరా నిలిచిపోయింది. ఫైర్ స్టేషన్ సమీపంలోని ఏబీ స్విచ్ జంపర్ కూడా కట్ అయింది. విద్యుత్ సిబ్బంది వెంటనే ఏబీ స్విచ్‌ను ఓపెన్‌లో ఉంచి, డిజివలస సబ్‌స్టేషన్ నుంచి ప్రత్యామ్నాయంగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అనంతరం స్వామివారి వీధిలో హెచ్‌టీ లైన్ స్ట్రింగింగ్ పనులు చేపట్టి విద్యుత్ లైన్ల మరమ్మతులను వేగవంతం చేశారు. విద్యుత్ సరఫరాను పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

సంబంధిత పోస్ట్