బొబ్బిలి నియోజకవర్గంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వెంటనే 12వ పీఆర్‌సీ ప్రకటించాలని కోరుతూ యుటీయఫ్ నాయకులు ఎమ్మెల్యే బేబీ నాయనను కలిసి వినతిపత్రం అందజేశారు. పీఆర్‌సీ కమిటీని తక్షణమే నియమించడం, మధ్యంతర భృతి ప్రకటించడం, ఉద్యోగులు-ఉపాధ్యాయులకు బకాయి ఉన్న సుమారు రూ. 29 వేల కోట్లను చెల్లించడం, బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించాలని వారు కోరారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ ఈ అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీలో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు.