విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యత

రామభద్రపురం మండలం నాయుడువలస పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని సహాయకులు జె. సి. రాజు తెలిపారు. గురువారం పాఠశాలలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థులకు విటమిన్, ఐరన్ మాత్రలు పంపిణీ చేశారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ప్రతివారం ఐరన్ మాత్రలు తీసుకోవాలని, దీని ద్వారా రక్తహీనతను నివారించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎమ్ భవాని, ఆశా కార్యకర్త లక్ష్మీ, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్