గుర్ల మండలంలోని గుజ్జింగ్ర వలస గ్రామంలో 'మన కుటుంబం - మన కార్యకర్త' కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజాం, విజయనగరం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ కె.వి. సూర్యనారాయణ రాజు (పులి రాజు) పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన గ్రామ కమిటీ సభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు పొట్నూర్ సన్యాసినాయుడు, స్థానిక జడ్పిటిసి శిర అప్పలనాయుడు, వైస్ ఎంపీపీ తోట తిరునాధరావు, కెంగువ మధుసూదన్ రావు, గ్రామ పార్టీ పెద్దలు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.