నేతన్నలకు ఊరట.. పింఛన్ పంపిణీలో పాల్గొన్నా ఎమ్మెల్యే

ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా, బాడంగి మండలం ముగడ గ్రామంలో ఎమ్మెల్యే ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీ నాయన) మరియు బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరించారు. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు తెలిపారు. దీంతో చేనేత కార్మికులకు ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొన్నారు. అనంతరం కోమటిపల్లి గ్రామంలో స్పౌజ్ పింఛన్లు కూడా అందజేశారు.

సంబంధిత పోస్ట్