కాన్సర్ బాధితునికి రోటరీ ఆర్ధిక సహకారం

నమ్మకమైన మానవీయ సమాజ సేవలకు గుర్తింపు పొందిన బొబ్బిలి రోటరీ క్లబ్, గుమ్మలక్ష్మీపురానికి చెందిన బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఉపేంద్ర (24) అనే యువకుడికి అండగా నిలిచింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి తోడుగా, గ్లోబల్ పార్టనర్ వెంకటాద్రి పంపిన 20 వేల రూపాయలకు, జిల్లా చైర్మన్ జె సి రాజు మరో 10 వేల రూపాయలు కలిపి మొత్తం 30 వేల ఆర్థిక సహాయాన్ని ఉపేంద్ర తల్లి లక్ష్మికి అందజేశారు. రానున్న రోజుల్లో కూడా సహకరిస్తామని రోటరీ క్లబ్ భరోసా ఇచ్చింది.

సంబంధిత పోస్ట్