బుధవారం సాయంత్రం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, ఆయన సోదరుడు వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శంబంగి వేణుగోపాల్ నాయుడు, వైయస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సమావేశంలో, శంబంగి సోదరులు నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక అంశాలపై జగన్ మోహన్ రెడ్డితో చర్చించారు. ఈ భేటీలో నియోజకవర్గ అభివృద్ధి, రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగినట్లు సమాచారం.