మహిళలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన ఎస్హెచ్ఓ

బొబ్బిలి మండలం వెలగవలస గ్రామంలో అభ్యుదయం 2.0 మరియు పబ్లిక్ పర్సెప్షన్ కార్యక్రమంలో భాగంగా, ఎస్హెచ్ఓ బొబ్బిలి ఆధ్వర్యంలో మహిళలకు శనివారం అవగాహన కల్పించారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు, డ్రగ్స్, గంజాయి దుష్ప్రభావాలు, సైబర్ నేరాల నివారణ, శక్తి యాప్ వినియోగం, రోడ్డు భద్రతా నియమాలు, మరియు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొని సూచనలు తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్