బొబ్బిలిలోని శ్రీ చైతన్య విద్యానికేతన్ విద్యార్థులు ఈనాడు యాజమాన్యం నిర్వహించిన ప్రతిభ పాటవ పోటీలలో ఐదు విభాగాలలో విజయం సాధించారు. 10వ తరగతికి చెందిన బ్యాంకురు దీక్షిత డిబేటింగ్‌లో మొదటి బహుమతి, 9వ తరగతికి చెందిన చింతల రితీష్ క్విజ్‌లో మొదటి బహుమతి, 10వ తరగతికి చెందిన చైతన్య గౌతమ్ వ్యాసరచనలో మొదటి బహుమతి, 9వ తరగతికి చెందిన బి.సహిత వ్యాసరచనలో మూడవ స్థానం, 9వ తరగతికి చెందిన వి.రేణుశ్రీ డ్రాయింగ్‌లో రెండవ బహుమతి గెలుచుకున్నారు. విజేతలను పాఠశాల సెక్రటరీ డి. పద్మ, ఉపాధ్యాయ బృందం అభినందించారు. ఈనాడు యాజమాన్యానికి, నిర్వాహకులకు పాఠశాల తరపున కృతజ్ఞతలు తెలిపారు.