బొబ్బిలిలో ఘనంగా రాష్ట్ర స్థాయి కోలాటం పోటీలు నిర్వహణ

గొల్లపల్లి దాడితల్లి–పాతబొబ్బిలి సరేపోలమ్మ జంట సిరిమానోత్సవాల సందర్భంగా బొబ్బిలిలో ఆదివారం రాష్ట్ర స్థాయి కోలాటం పోటీలు నిర్వహించారు. స్థానిక రాజా కళాశాల మైదానంలో జరిగిన ఈ పోటీలను ఎమ్మెల్యే బేబీనాయుడు, మున్సిపల్ కమిషనర్ లాలం రామలక్ష్మి, డీఎస్పీ రాకోటి గోవిందరావు, ఎంపీడీవో రవికుమార్ ప్రారంభించారు. ఏడు జిల్లాల నుంచి 17 బృందాలు పాల్గొని తమ కళాత్మక ప్రతిభను ప్రదర్శించాయి. విజేతలకు నగదు బహుమతులు అందజేయగా, మొదటి బహుమతిగా రూ. 20,116 ప్రకటించారు. పాల్గొన్న ప్రతి బృందాన్ని ప్రోత్సహించారు.

సంబంధిత పోస్ట్