బొబ్బిలిలో స్వచ్ఛ రథం ప్రారంభం: వ్యర్థాల సేకరణకు శ్రీకారం

బొబ్బిలి మండల పరిషత్ కార్యాలయం వద్ద డిప్యూటీ ఎంపీడీవో మౌలి ఈశ్వరరావు శనివారం 'స్వచ్ఛ రథం' వాహనాన్ని ప్రారంభించారు. ఈరోజు కాసిం దొర వలస, నారాయణప్ప వలస గ్రామాల్లో ఈ రథం పర్యటిస్తుంది. ప్రజల నుండి పొడి వ్యర్థాలను సేకరించి, వాటి విలువకు సమానమైన వస్తువులను తిరిగి అందజేస్తారు. 'స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర' కార్యక్రమంలో భాగంగా గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే దీని లక్ష్యం. ఈ కార్యక్రమం విజయనగరం, బొబ్బిలి ప్రాంతాల్లో అమలు చేయబడుతుంది.

సంబంధిత పోస్ట్