టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ. 5 లక్షల భీమా చెక్కు

బొబ్బిలి నియోజకవర్గం రామభద్రపురం మండలానికి చెందిన టీడీపీ కార్యకర్త మైనాపు తాతయ్యలు అకాల మరణం చెందడంతో, వారి కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీనాయన) రూ. 5 లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారని, దేశంలోనే తొలిసారిగా కార్యకర్తల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చింతల రామకృష్ణతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్