డ్రంక్ అండ్ డ్రైవ్‌కు మూడు రోజుల జైలు శిక్ష

బొబ్బిలి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఎస్‌ఐ వి. జ్ఞానప్రసాద్ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో అసామీ వడ్డీ చరణ్ కుమార్ మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడుపుతున్నట్లు గుర్తించారు. అతడిని బొబ్బిలి స్పెషల్ జ్యూడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, ఇంచార్జ్ మెజిస్ట్రేట్ ఎం. రోహిణి రావు మూడు రోజుల జైలు శిక్ష విధించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్‌హెచ్‌ఓ కె. నారాయణరావు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్