వృద్ధ దంపతుల విషాద మరణం: గంటల వ్యవధిలోనే భార్యాభర్తలు కన్నుమూత

విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం రంగరాయపురంలో వృద్ధ దంపతులు వంగపండు వెంకటస్వామి (80), అప్పలనరసమ్మ (72) కొద్ది గంటల వ్యవధిలోనే మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అప్పలనరసమ్మకు, ఆదివారం ఉదయం భర్త వెంకటస్వామి మరణవార్త తెలియడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. భర్తను చూసేందుకు బయలుదేరిన ఆమె మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన కుటుంబ సభ్యులను, గ్రామస్థులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

సంబంధిత పోస్ట్