బొబ్బిలి, తెర్లాం గ్రామాలలో గత కొన్ని రోజులుగా వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఈ కుక్కలు పిల్లలపై దాడులు చేస్తున్నాయని, దీంతో గ్రామస్తులు, పెద్దలు భయాందోళనలకు గురవుతున్నారని గ్రామస్తులు, జనసేన పార్టీ నాయకులు అక్కి వరపు ప్రసాద్ తెలిపారు. తక్షణమే అధికారులు స్పందించి, కుక్కల బెడద నుండి ప్రజలకు రక్షణ కల్పించాలని వారు కోరారు. తెర్లాం జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.