చెట్టును ఢీకొని యువకుడి మృతి

బొబ్బిలి మండలంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన జి. గంగరాజు అనే యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కోమటిపల్లి భాస్కర ఫార్మసీ కళాశాల సమీపంలో బైక్‌పై వెళ్తుండగా, రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొనడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే 108 అంబులెన్స్‌లో బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స ప్రారంభించగానే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గంగరాజు బలిజిపేట మండలం పణుకువలసకు చెందినవారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్