కోమటిపల్లిలో వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయ ప్రారంభం

బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే శంబంగి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి రాబోయే పంచాయితీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా వైఎస్ఆర్సిపి జనరల్ సెక్రెటరీ శంబంగి వేణుగోపాల్ నాయుడు, బొబ్బిలి మండలం ఎంపీపీ శంబంగి లక్ష్మి, మాజీ ఎంపీపీ తమ్మిరెడ్డి దాము, బొద్దల సత్యనారాయణ, వంగపండు శ్రీరాములు నాయుడు, గ్రామ పెద్దలు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్