చీపురుపల్లి మండలం, నిమ్మలవలస గ్రామంలో భీష్మ ఏకాదశి సందర్భంగా రెండు రోజుల పాటు నిరంతరాయంగా ఏకం భజన కార్యక్రమం 10 గ్రామాల భజన బృందాలతో ఘనంగా జరిగింది. బెవర బంగారనాయుడు, కుటుంబ సభ్యులు, గ్రామ భజన బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, గ్రామంలో 5వ సారి ఏకం భజన పూర్తి చేసిన సందర్భంగా భజన మాస్టర్ కుమరాపు అప్పలనాయుడు, భజన బృందాలు కలిసి ఈ భజన ఏర్పాటు చేసిన బెవర బంగారు నాయుడిని ఘనంగా సన్మానించారు.