గ్రామ కమిటీల బలోపేతంపై బొత్స అనూష పిలుపు

గరివిడి మండలం రేగటి గ్రామంలో గ్రామ కమిటీతో పాటు అనుబంధ విభాగాల కమిటీల ఏర్పాటు కార్యక్రమంలో యువ నాయకురాలు డాక్టర్ బొత్స అనూష పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు ఆమె అభినందనలు తెలిపారు. సమన్వయంతో పనిచేస్తే పార్టీ మరింత బలపడుతుందని, శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ సూచనలతో గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్